Weather Report: తెలంగాణ రైతులకు వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. రాబోయే ఐదు రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీంతో వానల కోసం ఆకాశం వైపు ఆశగా చూస్తున్న రైతులకు శుభవార్తే అని చెప్పాలి. ముఖ్యంగా వరి, కందులు మొదలైన వర్షాధారిత పంటల సాగు రైతులకు ఇది గుడ్ న్యూస్. అయితే మరోవైపు వర్షం కారణంగా జనం అప్రమత్తంగా ఉండాల్సిన…