Supreme Court: రెండు దశాబ్ధాల క్రితం చోటు చేసుకున్న హత్యలో నిందితుడికి యావజ్జీవ శిక్షని సుప్రీంకోర్టు సమర్థించింది. భార్యతో అక్రమసంబంధం పెట్టుకున్న వ్యక్తిని పోలీస్‌స్టేషన్‌లోనే కానిస్టేబుల్ అయిన భర్త తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చి చంపాడు.
ఓ కసాయి తల్లి అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని కన్న కొడుకునే హతమార్చింది. ఈ ఘటన పటాన్ చెరులో చోటుచేసుకుంది. పటాన్‌చెరులోని ముత్తంగి వద్ద ఔటర్ రింగ్ రోడ్డు ( ఓఆర్‌ఆర్ ) సర్వీస్ రోడ్డు పక్కన 10 ఏళ్ల వయస్సున్న గుర్తుతెలియని బాలుడి మృతదేహం ఈనెల 11న లభ్యమైంది.
Illicit Relationship: అక్రమ సంబంధానికి 22 నెలల పసికందు అడ్డుగా ఉందని నేలకేసి కొట్టి చంపాడు ఓ కామాంధుడు. ఈ దారుణ ఘటన సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల పరిధిలోని ఐలాపురం గ్రామంలో చోటుచేసుకుంది.
Delhi High Court: భార్యభర్తలు వివాహేతర సంబంధం కలిగి ఉన్నారని తప్పుడు ఆరోపనలు చేయడం, పిల్లలను తల్లిదండ్రులు నిరాకరించడం తీవ్ర మానసిక క్రూరత్వమే అని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది.
ఉపాధి కోసం సౌదీ అరేబియాలో పని చేస్తున్న ఓ వ్యక్తి.. తన భార్య అక్రమ సంబంధానికి సంబంధించిన వీడియోలు బయటపడ్డాయి. దీంతో హుటాహుటిన అక్కడి నుంచి ఇండియాకు వచ్చాడు. ఈ తతంగాన్ని ప్రశ్నించేందుకు స్వదేశానికి వచ్చిన భర్తపై భార్య ప్రియుడితో కలిసి దాడి చేయించింది. ఈ ఘటన యూపీలోని బులంద్‌షహర్‌లోని కొత్వాలి దేహత్ ప్రాంతంలో జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. తన భార్య ఓ వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని.. ఈ క్రమంలో తన మొబైల్…
Wife Kills Husband: ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాల మూలంగా సంసారాలు కూలిపోతున్నాయి. ముఖ్యంగా ఇలాంటి సంబంధాల్లో హత్యలు, ఆత్మహత్యలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి.
ఉత్తర ప్రదేశ్ లోని ఘజియా బాద్ లో దారుణం చోటు చేసుకుంది. అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా వస్తున్నాడని ప్రియుడితో కలిసి భార్య హత్య చేయించింది. తర్వాత ఏమీ ఎరుగనట్లు అనుమానం రాకుండా సదరు మహిళ పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు పెట్టింది. కాగా.. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు.. అసలు విషయాలను బయటకు రాబట్టారు.
Illicit Relationship: చాలా వరకు వివాహేతర సంబంధాలు హత్యలు, ఆత్మహత్యలకు దారి తీస్తున్నాయి. ప్రియుడు లేదా ప్రియురాలు హత్యలకు గురైన సంఘటనలను మనం చాలానే చూశాం. తాజాగా మరోసారి అలాంటి సంఘటనే చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే బీహార్ సమస్తిపూర్‌కి చెందిన ఓ వ్యక్తి భార్యతో కాకుండా మరో యువతితో అక్రమ సంబంధాన్ని కొనసాగించారు. ఇది తెలుసుకున్న భార్య, ప్రియురాలిని చంపాలని ఒత్తిడి తేవడంతో హత్య చేశాడు.
Teacher: అమెరికాలో విద్యార్థి-ఉపాధ్యాయుడి బంధానికి విలువ లేకుండా పోయింది. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచర్లే తప్పు దారి పడుతున్నారు. తమ విద్యార్థులతో అనైతిక బంధాన్ని పెట్టుకుంటున్నారు. శారీరక సుఖం కోసం విద్యార్థులను తప్పుదోవపట్టిస్తున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి సంఘటనలు చాలా వెలుగులోకి వచ్చాయి. తాజాగా మరోసారి ఇటాంటి సంఘటనే వెలుగులోకి వచ్చింది. ఓ మహిళా టీచర్, 14 ఏళ్ల విద్యార్థిపై లైంగిక వేధింపులకు పాల్పడింది. చివరకు విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.
Illicit Relationship: సభ్య సమాజం తలదించుకునేలా, ఇలా కూడా అక్రమ సంబంధం పెట్టుకుంటారా అని నోరెళ్ల పెట్టేలా ఓ వ్యక్తి, ఓ మహిళ అనైతిక సంబంధం పెట్టుకున్నారు. ఏకంగా కూతురి అత్తగారితో లవ్ లో పడ్డాడు ఓ వ్యక్తి. ఇద్దరూ కూడా ఇంట్లో నుంచి పారిపోయారు. చివరకు ఈ సంబంధాన్ని బంధువులు వ్యతిరేకించడంతో తనువు చాలించారు. నడి వయస్కులైన ఈ జంట చివరకు ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు తెలిపారు.