Child Trafficking : చైల్డ్ ట్రాఫికింగ్ ముఠా నుంచి రాచకొండ పోలీసులు 10 మంది చిన్నారులను రక్షించి, శిశు విహార్‌కు తరలించారు. ఈ ముఠా వివిధ ప్రాంతాల నుంచి చిన్నారులను అక్రమంగా తీసుకువచ్చి అమ్మకాలు జరిపినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ ముఠా ముఖ్యంగా మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, ముంబై, ఉత్తరప్రదేశ్‌లోని మురికివాడలలోని నిరుపేద కుటుంబాల పిల్లలను లక్ష్యంగా చేసుకుంది. అనంతరం వీరిని తమిళనాడు, బెంగళూరు, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ వంటి ప్రాంతాల్లో పిల్లలేని తల్లిదండ్రులకు అమ్ముతున్నారు. ఈ ముఠాలో…