దివ్యాంగులకు గుర్తింపు కార్డులు అందజేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అందులో భాగంగా రాష్ట్రంలో దివ్యాంగులకు గుర్తింపు కార్డుల జారీకి అవసరమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అధికారులను ఆదేశించారు. దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమంపై సంబంధిత అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.