దేశంలో ప్రైవేటీకరణల పర్వం కొనసాగుతూనే ఉంది.. కొన్ని సంస్థలు, బ్యాంకులను విలీనం చేసిన ప్రభుత్వం.. మరికొన్ని సంస్థలను, బ్యాంకులను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడుతోంది.. ఇక, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ), ప్రభుత్వ భాగస్వామ్యంలోని ఐడీబీఐ బ్యాంక్‌ను ప్రైవేట్‌పరం చేసేందుకు వేగంగా అడుగులు వేస్తోంది ప్రభుత్వం.. అందులో భాగంగా పెట్టుబడిదారులను ఆకర్షించడానికి రోడ్ షోలు నిర్వహించనున్నట్లు ఆర్థికశాఖ సహాయ మంత్రి భగవత్ కరడ్ వెల్లడించారు.. ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణకు గతేడాది మేలోనే ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ…