T20 World Cup: భారత్‌లో జరగనున్న టీ20 వరల్డ్ కప్ 2026కు బంగ్లాదేశ్ జట్టు వెళ్లేందుకు నిరాకరించడంతో, ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్ను ఎంపిక చేయనున్నారు. వేదికల వివాదంతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ), అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మధ్య కొనసాగుతున్న వివాదమే ఈ పరిణామానికి ప్రధాన కారణంగా మారింది.