రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో దారుణం చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ వసతిగృహంలో ఉంటున్న ఇంజినీరింగ్ విద్యార్థినిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. విద్యార్థిని కేకలు విన్న పక్క గదిలోని నలుగురు విద్యార్థులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. యువకుడిపై కేసు నమోదు చేసి స్టేషన్‌కు తరలించారు. ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్థిని ఇబ్రహీంపట్నం మండలంలోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతోంది.…