జేమ్స్ కేమరాన్ అద్భుత ప్రేమకావ్యం ‘టైటానిక్’ చూసిన వారెవరైనా సరే అందులో నాయికపై మనసు పారేసుకోవలసిందే! అందులో రోజ్ డివిట్ బుకెటర్ పాత్రలో కేట్ విన్స్ లెట్ ఒదిగిపోయారు. ఆమె అభినయం, అందం అయస్కాంతంలా కుర్రాళ్ళను ఆకర్షించాయి. దాంతో పదే పదే కేట్ ను చూడటానికే ‘టైటానిక్’కు పరుగులు తీశారు రసికాగ్రేసరులు. ఇప్పటి దాకా మూడు సార్లు ‘బ్రిటిష్ అకాడమీ ఫిలిమ్ అండ్ టెలివిజన్ అవార్డ్స్’ (బి.ఎ.ఎఫ్.టి.ఏ.) అందుకున్న కేట్ విన్ స్లెట్ ఐదో సారి ‘ఐ…