గాన గంధర్వుడు, ప్రముఖ గాయకుడు, దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (ఎస్పీ బాలు) విగ్రహాన్ని హైదరాబాద్‌లోని రవీంద్రభారతి ప్రాంగణంలో ఆవిష్కరించడం అనేక నాటకీయ పరిణామాల నడుమ జరిగింది. బాలు సోదరి ఎస్పీ శైలజ మరియు ఆమె భర్త, నటుడు శుభలేఖ సుధాకర్ ఆధ్వర్యంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. విగ్రహావిష్కరణ పనులు జరుగుతున్న సమయంలో అనుకోని సంఘటన చోటు చేసుకుంది. ఓ తెలంగాణ ఉద్యమకారుడు, పృథ్వీరాజ్ అనే వ్యక్తి విగ్రహ ఏర్పాటును అడ్డుకునేందుకు ప్రయత్నించారు. “ఆంధ్ర ప్రాంతానికి చెందిన…