మల్నాడు డ్రగ్స్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్ అయ్యారు. వ్యాపారవేత్త సందీప్ జువ్వాడితో పాటు సాఫ్ట్వేర్ ఇంజీనీర్ లోచన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సందీప్ జువ్వాడి ఇంట్లోనే డ్రగ్ పార్టీలు జరిగినట్లు గుర్తించారు. మల్నాడు రెస్టారెంట్ యజమాని పార్టీలు నిర్వహించినట్లు తేలింది. మల్నాడు డ్రగ్స్ కేసులో ఏడు పబ్‌లకు నోటీసులు జారీ చేశారు. ప్రిజం పబ్, ఒకా పబ్, క్వాక్ పబ్, బ్రాడ్ వే, ఓక కోరా, క్వాక్ పబ్, పబ్బులకు నోటీసులు పంపారు.. డ్రగ్ పార్టీల…
మల్నాడు రెస్టారెంట్ డ్రగ్ పార్టీ కేసులో పబ్ యజమానులకు చుక్కెదురైంది. ఈగల్ టీం మూడు పబ్బుల యజమానులపైన కేసులు నమోదు చేసింది. మల్నాడు రెస్టారెంట్ సూర్యతో ముగ్గురు పబ్ యజమాలతో సంబంధాలు ఉన్నట్లు తెలిసింది. మూడు పబ్ యజమాలతో కలిసి డ్రగ్ పార్టీలు నిర్వహించినట్లుగా ఈగల్ టీం గుర్తించింది. పబ్బుల్లో డ్రగ్స్ పార్టీ కోసం ప్రత్యేక ఏర్పాటు చేసినట్లు బట్టబయలైంది.