భారతీయ సమాజంలో సంతానానికి చాలా ప్రాధాన్యత ఉంది. తల్లిదండ్రులు కూడా పిల్లల కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధపడతారు. వారి కోసమే ఆస్తులు కూడబెడతారు. సంతానాన్ని కూడా ఆస్తిగానే భావిస్తారు. అలాంటిది సంతానం లేదంటే.. ఆ విషయాన్ని జీర్ణించుకోవడానికి చాలా మంది ఇష్టపడరు. దీంతో సంతాన సాఫల్యం కోసం కృత్రిమ మార్గాలను వెతుకుతారు. గతంలో కృత్రిమ గర్భధారణ పద్ధతులు ప్రాచుర్యంలోకి రానప్పుడు దత్తతలు ఎక్కువగా జరిగేవి.