Hyderabad: జీడిమెట్లలో నూతన సంవత్సర వేడుకలు విషాదంగా మారాయి. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని భవానినగర్‌లో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని రాత్రి 17 మంది కలిసి వేడుకలు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా మద్యం సేవించి బిర్యానీ తిన్నారు. అనంతరం ఒక్కసారిగా అందరూ అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనలో పాండు (53) అనే వ్యక్తి మృతి చెందగా, మరో 15 మంది అపస్మారక స్థితిలోకి వెళ్లారు. బాధితులను చికిత్స నిమిత్తం నారాయణ మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న…