హైదరాబాద్ వాతావరణ కేంద్రం నగర ప్రజలను అలర్ట్ చేసింది. రాబోయే 2 గంటల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్ అంతటా కుములోనింబస్ తుఫాను విస్ఫోటనం జరుగుతోందని వెల్లడించింది. ప్రధానంగా హైదరాబాద్‌లోని పశ్చిమ, ఉత్తర, దక్షిణ ప్రదేశాల్లో భారీ వర్షం కురువనుందని తెలిపింది. ఇళ్లకు వెళ్లే వాళ్లు త్వరగా బయలు దేరాలని సూచించింది.