తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు దేశ, విదేశాల నుంచి వచ్చే ప్రతినిధులను ఆకట్టుకునేలా హైదరాబాద్ ను అందంగా ముస్తాబు చేసేందుకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. అత్యాధునిక టెక్నాలజీ హంగులు ఓ వైపు, తెలంగాణ ప్రత్యేక ఎట్రాక్షన్స్ మేళవింపుతో మరో వైపు జరుగుతున్న ఏర్పాట్లు తుదిదశకు చేరుకున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రముఖ ప్రదేశాలు, చెరువులు, రహదారులు, సమ్మిట్ వేదిక.. ఇలా అన్ని చోట్లా హైటెక్ ప్రొజెక్షన్లు, డిజిటల్ రూపంలో ప్రదర్శనలు , ఆధునిక విజువల్…