సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో పోలీసు రాజ్యాన్ని నడుపుతున్నారని.. పోలీసులను తాబేదార్లుగా మార్చుకున్నారని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆరోపించారు. తాజాగా తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం ప్రశ్న, నిరసన కచ్చితంగా ఉండాలన్నారు. తెలంగాణలో ప్రశ్నించడానికి, నిరసన తెలపడానికి హక్కు లేదని.. బీఆర్ఎస్ కార్యకర్తలపై రాష్ట్రవ్యాప్తంగా ఐదువేల కేసులు పెట్టారన్నారు. రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగం బదులు అనుముల రాజ్యాంగం నడుస్తోందని విమర్శించారు. మల్కాజిగిరిలో మెదక్ ఎమ్మెల్యే తన రౌడీ అనుచరులతో వెళ్లి.."ఏయ్ సీఐ ఇటు రా.." అని…