Musi River Front : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు వేగంగా అమలవుతోంది. ఈ ప్రాజెక్ట్ పనులను ముందుకు తీసుకెళ్లేందుకు మూసీ నిర్వాసితుల పునరావాసం, ఆర్థిక సహాయంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకోసం మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పోరేషన్ కు పురపాలక శాఖ రూ. 37.50 కోట్ల నిధులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం ఇప్పటికే నదిగర్భంలో నివసిస్తున్న కుటుంబాలకు తాత్కాలిక ఖర్చుల నిమిత్తం రూ. 25 వేల…