ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టు…హుజురాబాద్ ఉప ఎన్నిక ఓటరు చావుకొచ్చింది. ఈ ఎన్నికల ప్రచారం వారికి పెద్ద తలనొప్పిగా పరిణమించింది. దాదాపు ఐదు నెలల నుంచి నియోజకవర్గం ప్రజలు వింత సమస్యని ఎదుర్కొంటున్నారు. రోజుకు కనీసం పది నుంచి పన్నెండు మంది గుంపు ఇంటికి వచ్చి దండం పెట్టి మరీ టార్చర్ చేస్తున్నారు. ఒక గ్రూపు అటు తిరగారో లేదో..ఇటు ఇంకో గ్రూపు రెడీ. కండువాలే తేడా..సీన్ మాత్రం ఒకటే. నేతలు ఇంటికి వచ్చి ఓటేయమని అడగటం…