ఢిల్లీ హృదయభాగంలో చోటుచేసుకున్న ఓ పార్కింగ్ వివాదం, ప్రాణాంతక ఘటనగా మారి బాలీవుడ్ నటి హుమా ఖురేషీ కుటుంబాన్ని విషాదంలో ముంచేసింది. అసలు ఏం జరిగింది అంటే.. ఢిల్లీ నిజాముద్దీన్ ప్రాంతంలో జరిగిన చిన్న పార్కింగ్ వివాదం దారుణ హత్యకు దారితీసింది. బాలీవుడ్ నటి మహారాణి ఫేమ్ హుమా ఖురేషీకి కజిన్ సోదరుడు ఆసిఫ్ ఖురేషీ (42) గురువారం రాత్రి హత్యకు గురయ్యాడు. రాత్రి 11 గంటల సమయంలో తన ఇంటి ముందు స్కూటర్ పార్క్ చేసిన…