లక్నోలో విషాదం చోటుచేసుకుంది. లక్నోలోని గోసాయిగంజ్‌లో స్నానం చేస్తుండగా ముగ్గురు పిల్లలు నదిలో మునిగిపోయారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు. సాలెంపూర్‌లోని మజ్రా లోధ్ పూర్వా గుండా ప్రవహించే లోనీ నదిలో ముగ్గురు పిల్లలు స్నానం చేసేందుకు నదిలో దిగారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ముగ్గురు పిల్లలు నీటిలో కొట్టుకుని పోయారు. వెంటనే ఘటనా స్థలానికి తహసీల్దార్ గోసైన్‌గంజ్ గుర్‌ప్రీత్ సింగ్, పోలీసులు చేరుకున్నారు. లోధ్ పూర్వ నివాసి అయిన గుడ్డు అనే కార్మికుడు శుక్రవారం…