అగ్ర రాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టిస్తున్నాయి. వాషింగ్టన్ డీసీలోని హోవార్డ్ యూనివర్సిటీలో దుండగులు జరిపిన కాల్పుల్లో నలుగురు చనిపోయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. శుక్రవారం రాత్రి 8:23 గంటల సమయంలో ఈ కాల్పులు జరిగినట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరి దర్యాప్తు చేపట్టారు. దుండగుల కోసం గాలిస్తున్నారు.