నీట్ పరీక్ష ఫలితం 2024 ప్రకటించిన తర్వాత.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సమగ్రతపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. వాస్తవానికి ఈ ఏడాది ఫలితాల్లో 720కి 720 మార్కులు తెచ్చుకున్న 67 మంది విద్యార్థులు ఉన్నారు. ఫలితాలు చూసిన తర్వాత ఇంత మంది పిల్లలకు పూర్తి మార్కులు ఎలా వచ్చాయి అనే ప్రశ్నలు తలెత్తాయి.