ఇజ్రాయెల్ పార్లమెంట్ (నెస్సెట్)లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్టాండింగ్ ఒవేషన్ అందుకున్నారు. అక్కడ ఆయనకు శాసనసభ్యుల నుంచి సుదీర్ఘ చప్పట్లు, హృదయపూర్వక ప్రశంసలు లభించాయి. ఈ సమావేశంలో, అమెరికా-ఇజ్రాయెల్ సంబంధాలను బలోపేతం చేయడానికి చేసిన కృషికి విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్, ఇజ్రాయెల్‌కు అమెరికా రాయబారి మైక్ హకబీ ప్రత్యేక ప్రశంసలు అందుకున్నారు. హమాస్ చెర నుంచి ప్రాణాలతో ఉన్న బందీలందరూ తిరిగి వచ్చిన తర్వాత ఇజ్రాయెల్‌లో అమెరికా అధ్యక్షుడు…