కార్తీక మాసం అంటే శివుడికి అత్యంత ప్రీతికరమైన మాసం.. .. ఈ మాసంలో ప్రతీ శైవక్షేత్రంతో పాటు.. ప్రతీ శివాలయంలోనూ ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తూ.. కార్తీక దీపాలను వెలిగిస్తూ.. తమ మొక్కులను తీర్చుకుంటారు భక్తులు.. ఇక, కార్తీక మాసంలో వచ్చే తొలిసోమవారానికి ఎంతో ప్రత్యేకత ఉందనే చెప్పాలి.. శ్రీశైలంలో కార్తీకమాస మొదటి సోమవారం మల్లన్నకు ప్రీతికరమైన రోజు.. దీంతో ముక్కంటి క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది..