తన నాలుకను నోటితో తాకాలంటూ ఓ బాలుడిని బౌద్ధ మత గురువు దలైలామా కోరడం తాజాగా తీవ్ర వివాదాస్పదమైంది. సంబంధిత వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో దలైలామా క్షమాపణలు చెప్పారు. బౌద్ధ ఆధ్యాత్మిక గురువు బాలుడికి, అతని కుటుంబ సభ్యులకు క్షమాపణలు చెప్పారు.