Hizbul Mujahideen: రెండు దశాబ్దాలుగా పరారీలో ఉన్న కరడుకట్టిన హిజ్బుల్ ముజాహిదీన్‌తో సంబంధం ఉన్న ఉగ్రవాదిని ఉత్తర్ ప్రదేశ్ ఉగ్రవాది నిరోధక దళం(ఏటీఎస్) అరెస్ట్ చేసింది. ఉల్ఫత్ హుస్సేన్ అలియాస్ మొహమ్మద్ సైఫుల్ ఇస్లాం అలియాస్ అఫ్జల్ హుస్సేన్ మాలిక్‌ని మొరాదాబాద్‌లో అరెస్ట్ చేశారు. యూపీలో పెద్ద ఉగ్రవాద దాడికి కుట్ర పన్నుతున్నట్లు తేలింది.