సావిత్రీబాయి ఫులే 1831 జనవరి 3న నైగాన్, మహారాష్ట్ర (ప్రస్తుతం సతారా జిల్లా)లో జన్మించారు. సావిత్రి బాయి కుటుంబానికి తెలంగాణ ప్రాంతంతో బంధుత్వం ఉంది. వీరి బంధువులు నిజామాబాద్ జిల్లా లో బోధన్, నాందేడ్ కొండల్ వాడి ప్రాంతంలో, ఆదిలాబాద్ చుట్టుపక్కల ఉన్నారు. బోధన్ ప్రాంతపు మున్నూరుకాపులు వీరికి చుట్టాలు. ఆమె భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయిని, రచయిత్రిగా పేరుగాంచారు. నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన జ్యోతీరావ్ ఫూలే భార్య సాయిత్రి బాయి ఫూలే. కులమత…