Off The Record: ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైసీపీకి సీన్ రివర్స్ అవుతోందనే టాక్ నడుస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి తర్వాత అన్ని జిల్లాల్లోని నేతలంతా యాక్టివ్ అవుతున్నారు. జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. అసెంబ్లీ ఇంఛార్జ్‌లు అందరూ కాస్త యాక్టివ్‌గానే ఉన్నట్లు తెలుస్తోంది. పార్లమెంటు నియోజకవర్గాలకు అసలు ఇంఛార్జ్‌లు ఎక్కుడున్నారో కూడా తెలియని పరిస్థితి నెలకొందని సమాచారం. హిందూపురం పార్లమెంట్ ఇంఛార్జిగా గత ఎన్నికల…