హిందూ మైథలాజికల్ యానిమేటెడ్ చిత్రం ‘మహావతార్ నర్సింహా’ ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అదరకొడుతుంది. కన్నడ దర్శకుడు అశ్విన్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా, ఎలాంటి భారీ అంచనాలు లేకుండా విడుదలై, దేశవ్యాప్తంగా సెన్సేషన్‌గా మారింది. ఫలితంగా అశ్విన్ కుమార్ ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ల లిస్టులో చేరారు. అశ్విన్ కుమార్ కేవలం దర్శకుడు మాత్రమే కాదు – రైటర్, ఎడిటర్, విజువల్ ఎఫెక్ట్స్ నిపుణుడిగా కూడా తన ప్రతిభను చాటుకున్నారు. ఆయన స్థాపించిన క్లీమ్ VFX స్టూడియో,…