Banks exposure to Adani Group: అదానీ గ్రూప్ కంపెనీల బిజినెస్‌లు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ రిలీజ్ అనంతరం ఇన్వెస్టర్లు, డిపాజిటర్లు లబోదిబో అంటున్నారు. తమ డబ్బు ఏమైపోతుందో ఏమోనని దిగులు పెట్టుకున్నారు. దీంతో పార్లమెంట్ సైతం ఇదే వ్యవహారంపై దద్దరిల్లుతోంది. ఈ నేపథ్యంలో.. అదానీ గ్రూపు సంస్థలకు రుణాలిచ్చిన బ్యాంకులు మరియు ఎల్‌ఐసీ ఒకదాని తర్వాత ఒకటి స్పందిస్తున్నాయి. తాము ఎంత లోనిచ్చామో చెబుతున్నాయి.