అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలోని కొట్నూర్ వద్ద వర్షపు నీరు ఇళ్ళ లోకి చేరి చేనేత కుటుంబాలు రోడ్డుపాలయ్యాయి. నేషనల్ హైవే కాంట్రాక్టర్ అక్కడ ఉన్న కాలువను మట్టితో కప్పేయడం తో వర్షపు నీరంతా ఇళ్లల్లోకి చేరి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. వర్షం పడిందంటే ఉపాధి కోల్పోయి పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని కోడూరు గ్రామానికి చెందిన కార్మికులు వాపోతున్నారు. తమ ఇంటి పక్కనే నేషనల్ హైవే పనులు జరుగుతుండడంతో ఉన్న ఇరిగేషన్ కాలువను మట్టితో…