దేశవ్యాప్తంగా ప్రధాని మోదీకి ఆదరణ ఉందని ఇప్పటికే పలు సర్వేలు నిరూపించాయి. అయితే దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా మన ప్రధాని మోదీకి ఫాలోయింగ్ ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ మరో రికార్డు సాధించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రాజకీయ నేతల్లో అత్యధిక సబ్‌స్క్రైబర్లు ఉన్న ఛానల్‌గా మోదీ యూట్యూబ్ ఛానల్ నిలిచింది. ఫిబ్రవరి 1 నాటికి ప్రధాని మోదీ యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబర్ల సంఖ్య కోటిని దాటింది. 2007లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో…