తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం చెల్లింపు అంశంపై హైకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సిద్దిపేటకు చెందిన సామాజిక కార్యకర్త కొండల్‌రెడ్డి పిల్‌పై హైకోర్టు విచారణ జరిపింది. రైతు కుటుంబాలకు పరిహారం చెల్లింపులో జాప్యంపై హైకోర్టు ఆగ్రహం చెందింది. ఏప్రిల్ 6న రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీచేసింది. రూ.6 లక్షలు చెల్లించేలా 2015లో ప్రభుత్వం జీవో ఇచ్చిందన్నారు పిటిషనర్ కొండల్ రెడ్డి. జీవో జారీ చేసి ఆరేళ్లు దాటినా పరిహారం…