ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం ఇప్పుడు 45వ రోజుకు చేరుకుంది. అయితే అక్టోబర్ 7 దాడుల సూత్రధారి యాహ్యా సిన్వార్‌ను ఇజ్రాయెల్ సైన్యం ఇంకా కనుగొనలేకపోయింది. గత వారం ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు యాహ్యా సిన్వార్‌ను దూషించారు. అతనిని జర్మన్ నియంత హిట్లర్‌తో పోల్చారు. యాహ్యా సిన్వార్ హిట్లర్‌లా దాక్కుంటున్నాడని, గాజా ప్రజలు నిరంతరం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నెతన్యాహు ఆరోపించారు.