తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.. ఇప్పుడు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతోంది.. ఆంధ్రప్రదేశ్ తీరాన్ని ఆనుకుని తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అంచనా వేసిన ఐఎండీ… ఆంధ్రప్రదేశ్‌కు ఎల్లో అలర్ట్ జారీ చేసింది… ఈ అల్పపీడన ప్రభావంతో.. ఉత్తరాంధ్రలో పలు చోట్ల భారీ వర్షాలలు కురుస్తాయని ఐఎండీ వర్గాలు చెబుతున్నాయి… ఇప్పటికే విశాఖపట్నంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి… వర్షానికి తోడు తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయి… ఇక, ఐఎండీ ఎల్లో వార్నింగ్…
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే వర్షాలు దంచికొడుతున్నాయి.. ఆంధ్రప్రదేశ్‌తో పాటు హైదరాబాద్ సహా తెలంగాలోని కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి.. అయితే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ చెబుతోంది.. పశ్చిమ మధ్య మరియు ఆనుకుని ఉన్న తూర్పుమధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది… ఇది రానున్న 48 గంటల్లో పశ్చిమ మధ్య మరియు ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం ఉత్తరాంధ్ర – దక్షిణ ఒడిశా తీరాల వెంబడి బలపడుతోందని తెలిపారు…