తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడలో ఉదయం భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. రహదారులపై వర్షాపు నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే కాల్వలో చెత్తచెదారం తీయకపోవడంతో వర్షపు నీరు నిలిచిపోయిందని స్థానికులు వాపోతున్నారు. అంతేకాకుండా భారీ వర్షం కారణంగా పలు కాలనీల్లో వర్షపు నీరు చేరడంతో అధికారులు వర్షపు నీటిని తోడుతున్నారు. వర్షపు నీటితో డ్రైనేజీలు పొంగి రహదారులపై ప్రవహిస్తోంది. ఇదిలా ఉండగా.. నైరుతి బంగాళాఖాతం…