దాయాది దేశం పాకిస్థాన్‌ను భీకర వరదలు అతలాకుతలం చేస్తు్న్నాయి. దేశంలోని సగానికి పైగా భూభాగం వరదను ఎదుర్కొంటోందని ఓ పాక్ మంత్రి వెల్లడించారు. దీనిని బట్టి చూస్తే అక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
పాకిస్థాన్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వర్షాల వల్ల సంభవించిన వరదల కారణంగా పాకిస్థాన్‌లో 5.7 మిలియన్లకు పైగా ప్రజలు ప్రభావితమయ్యారని ది న్యూస్ ఇంటర్నేషనల్ తెలిపింది. పాక్‌లో రెస్క్యూ, రిలీఫ్, పునరావాస చర్యలు కొనసాగుతున్నాయి.