నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తన మంచి మనసు చాటుకున్నారు. దీంతో ఆయనపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. గుండె సమస్యతో ఆపదలో ఉన్న ఓ చిన్నారికి ఎమ్మెల్యే కోటంరెడ్డి అండగా నిలిచారు. ఉప్పుటూరు గ్రామంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి ఇటీవల గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తుండగా.. గిరిజన కుటుంబానికి చెందిన చిన్నారి స్నేహకు గుండె సమస్య ఉన్నట్లు ఆయన దృష్టికి వచ్చింది. దీంతో వెంటనే స్పందించి కారు ఏర్పాటు చేసి తన ప్రతినిధిని పంపించి…