సమ్మక్క-సారక్క జాతర ముగియగానే ములుగు, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో హెల్త్ ప్రొఫైల్ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గురువారం తెలిపారు. ఈ ప్రాజెక్టుతో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. “నీతి ఆయోగ్ యొక్క 2019-20 ఆరోగ్య సూచీలో పెద్ద రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం మూడవ స్థానాన్ని పొందగా, బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్ దిగువన ఉంది. తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తోందని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ప్రకటించింది. రాష్ట్ర…
రాష్ట్ర ప్రజల హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్ట్ ను త్వరలో ప్రారంభిస్తాం అని మంత్రి కేటీఆర్ అన్నారు. మంత్రుల ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య శాఖ ఐటీ శాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. అయితే ఈ హెల్త్ ప్రొఫైల్ రికార్డ్ ప్రాజెక్టు కోసం ములుగు, సిరిసిల్ల జిల్లాలను ఎంపిక చేసారు. ఈ రెండు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు చేపట్టేందుకు నిర్ణయం తీసుకుంది. ప్రజల ప్రాథమిక ఆరోగ్య సమాచారం ప్రభుత్వం వద్ద ఉంటే, వారికి అవసరమైన కార్యక్రమాలను చేపట్టడంలో ఉపయుక్తంగా ఉంటుంది.…