సినీ విశ్లేషకుడు, బిగ్ బాస్ కంటెస్టెంట్ కత్తి మహేష్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఏపీలోని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. మొదట స్వల్పగాయాలు అయ్యాయని సమాచారం అందగా.. ఫోటోలు వైరల్ కావడంతో తీవ్రంగానే గాయపడ్డట్లు తెలిసింది. కత్తి మహేశ్ తల, కంటి భాగాలకు తీవ్రగాయాలయ్యాయని వైద్యులు తెలిపారు. ఆస్పత్రిలో చేరే సమయంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడంతో వెంటిలేటర్‌పై పెట్టామన్నారు.…