డ్రై ఫ్రూట్స్‌ను రోజూ మితంగా తీసుకోవడం ఆరోగ్యానికి అనేక రకాలుగా ప్రయోజనం చేస్తుంది. ఇవి సహజంగా పోషకాలతో నిండిపోయి శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజ లవణాలు, మంచి కొవ్వులు, ప్రోటీన్‌ను అందిస్తాయి. న్యూట్రిషన్ల ప్రకారం, డ్రై ఫ్రూట్స్‌ను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా అనేక వ్యాధులను దూరం ఉంచుకోవచ్చు. బాదం, వాల్‌నట్‌లో ఉన్న ఒమెగా–3 ఫ్యాటీ అసిడ్స్ హృదయాన్ని రక్షిస్తాయి.ఇవి చెడు కొలెస్ట్రాల్ (LDL)ను తగ్గించడంలో సహాయపడతాయి. వాల్‌నట్, బాదం మెదడు పనితీరు పెంచి, జ్ఞాపకశక్తి, దృష్టి…