(ఆగస్టు 29న విశాల్ పుట్టినరోజు) యంగ్ హీరో విశాల్ సినిమాలంటే మాస్ మసాలాతో నిండి ఉంటాయి. అన్ని వర్గాలను అలరించే ప్రయత్నం కనిపిస్తూ ఉంటుంది. విశాల్ నటించిన అనేక చిత్రాలు తెలుగులోకి అనువాదమై అలరించాయి. ఇప్పటికీ విశాల్ సినిమా వస్తోందంటే ఆసక్తిగా ఎదురుచూసేవారు తెలుగునాట ఎంతోమంది ఉన్నారు. విశాల్ పూర్తి పేరు విశాల్ కృష్ణారెడ్డి. ఆయన తండ్రి జి.కె.రెడ్డి గతంలో చిత్ర నిర్మాత. చిరంజీవి హీరోగా ‘ఎస్.పి.పరశురామ్’ అనే చిత్రాన్ని జి.కె.రెడ్డి నిర్మించారు. తరువాత తమిళంలోనూ జి.కె.రెడ్డి…