నేడు సినిమా అంటే కళాసేవ కంటే కాసులపై ధ్యాసనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఎందరో అభిరుచిగల నిర్మాతలు మారుతున్న కాలంతో పాటు విలువలు కనుమరుగై పోవడంతో చిత్రనిర్మాణానికి దూరంగా ఉన్నారు. ఇప్పటికీ అభిరుచితో చిత్రాలను నిర్మిస్తున్న అరుదైన నిర్మాతల్లో ‘స్రవంతి’ రవికిశోర్ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. తన బ్యానర్ పేరునే ఇంటిపేరుగా మార్చుకున్నారాయన. నవతరం ప్రేక్షకులకు మాత్రం స్టార్ హీరో రామ్ పోతినేని పెదనాన్నగా గుర్తుంటారు. ఏది ఏమైనా ‘స్రవంతి’ రవికిశోర్ ఈ నాటికీ తన అభిరుచికి…