ఒకప్పుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం లాగే పాడుతూ, జనాన్ని ఆకట్టుకున్నారు మనో. ఒకానొక సమయంలో ఏది బాలు పాడిందో, ఏ పాట మనో నోట పలికిందో అర్థం కాని పరిస్థితి కూడా నెలకొంది. బాలు బాటలోనే పయనిస్తూ రేయింబవళ్ళు పాడుతూనే ఇప్పటికి యాభై వేల పైచిలుకు పాటలు పాడి అలరించారు మనో. దాదాపు 15 భాషల్లో మనో పాట మధురం పంచింది. �