(జనవరి 24న రవిబాబు పుట్టినరోజు)నటదర్శకుడు రవిబాబును చూడగానే విలక్షణంగా కనిపిస్తారు. ప్రముఖ నటుడు చలపతిరావు కుమారుడే రవిబాబు. తండ్రి నటనలో రాణిస్తే తాను ఎంచక్కా ఎమ్.బి.ఏ. చదివి విదేశాలకు వెళ్ళి వేరే రూటులో సాగాలనుకున్నారు రవిబాబు. అయితే సినిమా వారబ్బాయి కదా, సినిమారంగమే రవిని అక్కున చేర్చుకుంది. పూనేలో ఎమ్.బి.ఏ. పూర్తిచేసిన రవికి ఓ ఆఫ్ బీట్ మూవీకి అసోసియేట్ గా పనిచేసే అవకాశం లభించింది. దాంతో సినిమాపై ఆకర్షణ పెరిగింది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్ రాజీవ్…