(మార్చి 14న ఆమిర్ ఖాన్ పుట్టినరోజు)ఆమిర్ ఖాన్ ఏది చేసినా, ఓ నిబద్ధతతో చేస్తారు. అందుకే ఆయనను అందరూ ‘మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్’ అని కీర్తిస్తారు. నటునిగా, నిర్మాతగా, దర్శకునిగా, రచయితగా, పాటగాడిగా చిత్రసీమలో సాగిన ఆమిర్ బుల్లితెరపై కూడా ‘సత్యమేవ జయతే’ వంటి కార్యక్రమాన్ని నిర్వహించి జనం మదిని దోచారు. ఆమిర్ తరచూ వార్తల్లో నిలిచే వ్యక్తిగా సాగారు. బాలీవుడ్ సూపర్ స్టార్ గా జేజేలు అందుకున్నారు. బుల్లితెరపైనా తన బాణీ పలికించాడు. కొన్ని సందర్భాల్లో…