Home
Harish Rao
Harish Rao News
-
CM Revanth Reddy : కృష్ణా జలాలపై హరీష్ రావుకు రేవంత్ సవాల్.. లెక్కలతో తేల్చుకుందామా?
CM Revanth Reddy : కృష్ణా జలాల వినియోగం, ప్రాజెక్టుల నిర్వహణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ మంత్రి హరీష్ రావుకు సూటి సవాల్ విసిరారు. ఎవరి పనితీరు మెరుగో గణాంకాలతో తేల్చుకుందామని సవాల్ చేస్తూ, బీఆర్ఎస్ పాలనలో కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టారని తీవ్రంగా విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత నీటి వినియోగంలో స్పష్టమైన మార్పు చూపించామని, గత ప్రభుత్వ వైఫల్యాలను లెక్కలతో ప్రజల ముందు పెడుతున్నామని సీఎం స్పష్టం చేశారు.… -
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో మరో అద్భుత ఘట్టం.. కనులపండువగా లక్ష్మీనృసింహుడి కల్యాణం
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా జరుగుతున్న కోటి దీపోత్సవం 2026 వేడుకల్లో ఆరో రోజు కార్యక్రమాలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగాయి. కార్తీక శుద్ధ దశమి సందర్భంగా నిర్వహించిన ఈ వేడుకల్లో ధర్మపురి శ్రీ లక్ష్మీనృసింహ స్వామి కల్యాణం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. నరేంద్ర చౌదరి నేతృత్వంలో ఎన్టీవీ, భక్తి టీవీ, వనిత టీవీల ఆధ్వర్యంలో 15వ ఏటా సాగుతున్న ఈ ఆధ్యాత్మిక మహా యజ్ఞానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పూజలు, దీపారాధనకు అవసరమైన సామాగ్రిని… -
CM Revanth Reddy : రాష్ట్ర హక్కుల కోసం రాజీలేని పోరాటం.. కేసీఆర్, హరీష్‌పై సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
సిద్దిపేట వేదికగా జరిగిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులపై నిప్పులు చెరిగారు. దొరల పాలన రావాలని, ప్రజా పాలన పోవాలని కొందరు మాట్లాడుతున్నారని విమర్శిస్తూ.. పదేళ్లలో రూ.8 లక్షల కోట్లు అప్పులు చేశారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌కు నీళ్లు వదులుతున్నారని తనపై విమర్శలు చేస్తున్నారని, అయితే తెలంగాణ గడ్డపై పుట్టిన బిడ్డగా రాష్ట్ర హక్కుల కోసం తాను ఎప్పుడూ పోరాడతానని స్పష్టం చేశారు. 2017లోనే చంద్రబాబుతో విడిపోయి… -
CM Revanth Reddy : సిద్దిపేటలో కేసీఆర్‌కు రేవంత్ సవాల్.. మెడికల్ కాలేజీకి మదన్ మోహన్ పేరు
సిద్దిపేట సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, కేటీఆర్‌లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పెద్ద సంఖ్యలో హాజరైన మహిళలు, కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఈ రోజుతో సిద్దిపేట గడ్డ కాంగ్రెస్ అడ్డా అని నిరూపితమైందని అన్నారు. ప్రజా పాలన ప్రగతిబాట కార్యక్రమంలో భాగంగా జిల్లాలో సుమారు రూ.550 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. 2029లో రెండోసారి ఇందిరమ్మ రాజ్యాన్ని ఏర్పాటు చేసి ప్రజా పాలన జెండా ఎగురేస్తామని… -
Harish Rao: కూకట్పల్లి ట్రక్ పార్క్ భూముల వేలంలో పాల్గొనేవారికి హరీష్ రావు వార్నింగ్..
Harish Rao: కూకట్పల్లి ట్రక్ పార్క్ భూముల వివాదంపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇదే భూముల విక్రయాలపై తాము పెద్ద ఎత్తున పోరాటం చేస్తే నాటి ప్రభుత్వం వెనక్కి తగ్గిందని గుర్తుచేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో ఒక్క గజం భూమిని కూడా అమ్మలేదని, ఆ ప్రయత్నమే చేయలేదని స్పష్టం చేశారు. కానీ, నేడు కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ… -
Harish Rao : కరువును కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయం చేస్తోంది
సంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులను కూడా ప్రభుత్వం రాజకీయ కోణంలో చూస్తోందని ఆరోపించారు. కరువు మండలాల ప్రకటనలో ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరించిందని, ముఖ్యంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో కరువు మండలాలను ఉద్దేశపూర్వకంగానే ప్రకటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లాపై చిన్నచూపు.. వర్షపాతం తక్కువైనా కరువు లేదుట మెదక్ జిల్లాలో కేవలం ఒక్క మండలాన్ని మాత్రమే కరువు మండలంగా… -
Harish Rao: కృష్ణా నీళ్ల లెక్కల్లో తేడాలేంటి? ఉత్తమ్‌కు హరీశ్ రావు కౌంటర్
కృష్ణా జలాల వినియోగం విషయంలో తప్పులను కప్పిపుచ్చుకుంటూ, అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB) సమావేశానికి తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన అధికారిక అజెండాకు, మంత్రి చెబుతున్న లెక్కలకు పొంతన లేదని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆయన ప్రశ్నించారు. కేఆర్ఎంబీకి ఒక లెక్క చెబుతూ, తెలంగాణ ప్రజలకు మరో లెక్క చెబుతూ ప్రభుత్వం మోసం… -
TPCC Mahesh Goud : కేటీఆర్, హరీష్ భ్రమల్లో ఉన్నారు.. కాంగ్రెస్ టార్గెట్ 100
తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షాలపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావులు వాస్తవాలను.. -
Harish Rao : రేవంత్ సర్కార్‌కు నీళ్లు తీసుకునే తెలివి లేదు..
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై గులాబీ పార్టీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. తెలంగాణలో సాగునీటి నిర్వహణపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తప్పుపడుతూ బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ప్రస్తుత ప్రభుత్వానికి నదుల నుంచి నీటిని ఒడిసిపట్టే కనీస పరిజ్ఞానం లేదని మండిపడ్డారు. ఎల్‌నినో ప్రభావం, తాగు, సాగునీటి ఎద్దడిపై ప్రభుత్వానికి ఎలాంటి పట్టింపు లేదని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టిసీమ ద్వారా ఎంతో చాకచక్యంగా నీటిని తరలించుకుపోతుంటే.. మన ప్రభుత్వం… -
Harish Rao : కరువు ముందే తెలుసు కదా.. నీళ్లెందుకు నిల్వ చేయలేదు.?
తెలంగాణలో తలెత్తిన కరువు పరిస్థితులు , విద్యుత్ సంక్షోభంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అసమర్థుడికి అధికారం అప్పగిస్తే ఇల్లు పీకి పందిరి వేసినట్టుగా రేవంత్ పాలన సాగుతోందని ఎద్దేవా చేశారు. కరువు రాగానే ప్రభుత్వం చేతులెత్తేసిందని, ప్రజలకు భరోసా ఇవ్వాల్సింది పోయి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. రెంకెలు వేసినంత మాత్రాన నిజాలు అబద్ధాలు కాదని, ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదని,…
తాజావార్తలు
-
Telangana ACB: ఏసీబీ అధికారులపై లంచం ఆరోపణలు..!
-
AP Panchayat Elections: పల్లెపోరులో ఏకగ్రీవాల జోరు.. రెండో విడతలో భారీ సంఖ్యలో ఏకగ్రీవాలు
-
BCCI: సిరాజ్‌ను తుది జట్టు నుంచి ఎందుకు తప్పించారు? మౌనం వీడిన బీసీసీఐ
-
OTR : కేటీఆర్ పాదయాత్ర ఎప్పటి నుంచి మొదలవుతుంది..?
-
OTR : ఏపీ స్థానిక ఎన్నికల్లో నెక్స్ట్ లెవెల్ ఫైట్
ట్రెండింగ్
-
Life Lessons : అమ్మమ్మ ఇచ్చిన తాళంచెవి.. తరాలకు అందించిన నమ్మకం.!
-
Masala Paneer Paratha Recipe: బ్రేక్‌ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా.. నోరూరించే ‘మసాలా పన్నీర్ పరాటా’ ఇలా చేసుకోండి..!
-
Fridge Cleaning Tips : ఫ్రిజ్ హ్యాండిల్ జిగటగా మారుతోందా?.. ఖరీదైన క్లీనర్లు లేకుండానే ఇలా సులభంగా శుభ్రం చేయండి
-
Kitchen Tips : సగం కోసిన ఉల్లిపాయను ఫ్రిజ్‌లో పెడుతున్నారా?.. ఈ తప్పు చేయొద్దు.!
-
Vaibhav Sooryavanshi: ఆయనతో మాట్లాడిన తర్వాతే ఈ విధ్వంసం సాధ్యమైంది.. 204 పరుగుల సీక్రెట్ బయటపెట్టిన వైభవ్!