నవతరం భామల్లో తమన్నా తనదైన బాణీ పలికిస్తూ సాగుతున్నారు. ఆమె పేరు వింటే చాలు కుర్రకారులో తమకాలు చెలరేగుతాయి. తపస్సు చేసుకొనేవారిలో సైతం తపనలు రేపే అందం తమన్నా సొంతం. అందంతో బంధాలు వేస్తున్నారామె. తమన్నాను చూడగానే చాలామందికి పాలరాతి బొమ్మకు ప్రాణం వచ్చిందే అనిపిస్తుంది. నిజమే! ఈ ‘మిల్కీ బ్యూటీ’ని చూస్తే ఆ భావన కలుగక మానదు. ఇంతలా అలరిస్తున్న మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా 1989 డిసెంబర్ 21న ముంబైలో జన్మించారు. మనెక్జీ కూపర్…