Raghava Lawrence:'కష్టించి పనిచేసేవాడిదే ఈ లోకం..' అన్నారు పెద్దలు. ఆ మాటను తు.చ. తప్పక పాటించిన వారిలో అత్యధికులు విజయతీరాలు చేరుకున్నారు. అలాంటి వారిలో ప్రముఖ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ నూ తప్పకుండా చేర్చాలి. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా రాఘవ కెరీర్ సాగింది. డాన్స్ మాస్టర్, నటుడు, దర్శకుడు, నిర్మాత, గాయకుడుగా రాఘవ తన ప్రతిభను చాటుకుంటూ సాగుతున్నారు.