‘రాజకీయమా… రాక్షసక్రీడనా…’ అంటూ ఓ సినిమాలో ఓ పాత్ర చెబుతుంది. నిజమే రాజకీయం ఓ రాక్షస క్రీడలా మారింది. అది ఇప్పుడు మరింత వికృత రూపం దాల్చిందని చెప్పవచ్చు. అయితే దాదాపు మూడున్నర దశాబ్దాల క్రితమే రాజకీయం పలు నీచపు చేష్టలు చేసింది. మహానటుడు, మహానాయకుడు నందమూరి తారక రామారావు రాజకీయ ప్రవేశం చేయగానే సినిమా రంగంలోనూ కొందరు ఆయనను విమర్శిస్తూ కొన్నిచేష్టలు చేశారు. అందులో భాగంగా యన్టీఆర్ సొంత తమ్ముని కుమారుడు నందమూరి కళ్యాణచక్రవర్తిని కూడా…