Gopichand: మాస్ హీరో అన్న పదానికి నిలువెత్తు నిదర్శనంగా నిలచే రూపం మేచోమేన్ గోపీచంద్ సొంతం. జూన్ 12తో 44 ఏళ్ళు పూర్తి చేసుకున్న గోపీచంద్ నటునిగా 30 సినిమాలు పూర్తి చేసుకున్నారు. తాజాగా 'భీమా' అనే చిత్రంలో నటిస్తున్నాడు. 'రామబాణం'తో 30 చిత్రాలు పూర్తి చేసుకున్న గోపీచంద్ తన 31వ చిత్రంగా 'భీమా'ను జనం ముందు నిలిపే ప్రయత్నంలో ఉన్నారు.